
ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ పేరు తెలియని వారుండరు. తన బ్యాట్‌తో ఎన్నో రికార్డులు క్రికెట్ చరిత్రలో లిఖించాడు. రాబోయే కాలంలో వీటిని బద్దలు కొట్టడం చాలా కష్టం. కానీ, ఒకవేళ ఈ రికార్డులు బ్రేక్ చేస్తే మాత్రం కచ్చితంగా ఆయా బ్యాటర్స్, ఆనందానికి అవధులు ఉండవు.

టీ20 ప్రపంచకప్ పేరిట విరాట్ కోహ్లి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. అతను చాలా మ్యాచ్‌లు ఆడాడు. కోహ్లీ రికార్డుల్లో కొన్ని ఇప్పటి వరకు బద్దలు కాలేదు. అలాంటి వాటిని ఇప్పుడు చూద్దాం..

2014లో ఆడిన T20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 2 రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అందులో మొదటిది టోర్నమెంట్ ఒక ఎడిషన్‌లో అత్యధిక సగటు 319లుగా నిలిచింది. అలాగే రెండవ అత్యధిక సగటు 106.33 కూడా కోహ్లీ పేరిట లిఖించుకున్నాడు.

2010లో మహేల జయవర్ధనే చేసిన 302 పరుగుల రికార్డును విరాట్ బద్దలు కొట్టాడు. T20 ప్రపంచ కప్ 2021లో విరాట్ కోహ్లి ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టడానికి పాకిస్తాన్‌కు చెందిన బాబర్ ఆజం ప్రయత్నించాడు. కానీ, అతను 16 పరుగుల దూరంలో అంటే 303 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

విరాట్, బాబర్ 2022 టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆడుతున్నారు. వీరే కాకుండా ఇంకా చాలా మంది స్టార్ బ్యాట్స్‌మెన్లు టోర్నీలో తమ ప్రతిభను కనబర్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అంటే ఈసారి మరెన్నో రికార్డులు నెలకొల్పేందుకు అవకాశం ఉంది.