AUS vs PAK: జీవితాన్ని మార్చిన ఆ 2 బంతులు..18ఏళ్లకు ముందే జాతీయ జట్టుకు ఎంపిక.. ప్రత్యర్ధులను బోల్తా కొట్టిస్తోన్న స్పీడ్ బౌలర్ ఎవరంటే?

|

Nov 12, 2021 | 7:08 AM

Shaheen Afridi: ఈ బౌలర్ చాలా చిన్న వయసులోనే తన ఆటలో తనదైన ముద్ర వేశాడు. రానున్న కాలంలో ఈ ఆటగాడు అతిపెద్ద బౌలర్‌గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

1 / 5
2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది తన బౌలింగ్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ నుంచి నిన్న ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ వరకు స్పీడ్‌, స్వింగ్‌ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. తన వేగంతో బ్యాట్స్‌మెన్‌లను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆధునిక బౌలర్లలో 21 ఏళ్ల షాహీన్ అఫ్రిది పేరు అగ్రస్థానంలో ఉంది. టీ20 ప్రపంచకప్‌లో తన ఆటతో ఆశ్చర్యపరుస్తున్నాడు. షాహీన్ అఫ్రిది, షాహిద్ అఫ్రిది అన్నదమ్ములని చాలా మంది నమ్ముతున్నారు. కానీ వారిద్దరు వేర్వేరు. ఇద్దరికీ ఒకే ఇంటిపేరు మాత్రమే ఉంది. అయితే రానున్న కాలంలో ఇద్దరూ బంధువులు కాబోతున్నారు. షాహిద్ అఫ్రిది పెద్ద కూతురుని షాహీన్ పెళ్లి చేసుకోతున్నాడు.

2 / 5
షాహీన్ ఆఫ్రిది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న లాండి కోటల్ అనే గ్రామంలో జన్మించాడు. అతను ఏడుగురు సోదరులలో చిన్నవాడు. అతని సోదరులందరూ క్రికెట్ ఆడతారు. అన్నయ్య పేరు రియాజ్. అతను షాహీన్ కంటే 15 సంవత్సరాలు పెద్దవాడు. అతను పాకిస్థాన్ తరఫున కూడా ఆడాడు. 2004లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కానీ అంతర్జాతీయ కెరీర్ ఒక్క మ్యాచ్‌కు మించి సాగలేదు. షాహీన్ అన్నయ్య రియాజ్‌ని తన రోల్ మోడల్‌గా భావిస్తాడు. రియాజ్ స్వయంగా ఫాస్ట్ బౌలర్ కూడా.

3 / 5
చిన్నతనంలో షాహీన్ అఫ్రిది ఆటలన్నీ ఆడేవాడు. వాటిలో ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ ఇలా ఎన్ని ఆడినా.. అతనికి క్రికెట్ మాత్రం చాలా ఇష్టమైనది. అనేక ఇతర పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ల మాదిరిగానే, షాహీన్ కూడా తన చిన్నతనంలో టేప్ బాల్ క్రికెట్ ఆడేవాడు. దీంతో యార్కర్లు వేయడంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. షహీన్‌కు క్రికెట్‌లో కుటుంబం నుంచి పూర్తి సహకారం లభించింది. ఒకసారి పాఠశాలలో ఉపాధ్యాయుడు షాహీన్, అతని సోదరుడు ఒకే జట్టులో ఆడవచ్చని చెప్పారు. షాహీన్ మరొక సోదరుడు అతని కంటే వేగంగా బౌలింగ్ చేసేవాడు. కానీ, షహీన్ మ్యాచ్ రోజు పాఠశాలకు వెళ్లవద్దని అతనిని ఒప్పించాడు. అప్పుడు షహీన్ మాత్రమే ఆడాడు.

4 / 5
షాహీన్ అఫ్రిదికి 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతను మొదటిసారి హార్డ్ బాల్‌తో ఆడాడు. పెషావర్ అండర్-16 జట్టు కోసం బరిలోకి దిగాలని అతని సోదరుడు షాహీన్‌ను కోరాడు. అక్కడ రెండు బంతులు వేసిన తర్వాత షాహీన్ పెషావర్ జట్టులో ఎంపికయ్యాడు. 18 నెలల పాటు ఇక్కడ ఆడిన తర్వాత పాకిస్థాన్ అండర్-19 జట్టులోకి ఎంపికయ్యాడు. 2018లో 17 ఏళ్ల వయసులో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో షహీన్ అరంగేట్రం చేశాడు. అతను లాహోర్ క్వాలండర్స్ జట్టులో సభ్యుడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో షాహీన్ పెద్దగా విజయం సాధించలేదు. ఈ సమయంలో, అతను ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి 86 పరుగులు ఇచ్చాడు. ఈ సమయంలో అతనికి ఎలాంటి వికెట్ దక్కలేదు. కానీ నాలుగో మ్యాచ్‌లో షాహీన్ ఆట మలుపు తిరిగింది. ఇందులో నాలుగు పరుగులకే ఐదు వికెట్లు తీశాడు.

5 / 5
పీఎస్‌ఎల్‌లో ఆడిన తర్వాత షహీన్ అఫ్రిది పాకిస్థాన్ జట్టులోకి ఎంపికయ్యాడు. అప్పుడు అతనికి 18 ఏళ్లు కూడా లేవు. అప్పటి నుంచి అతను పాక్ జట్టులో ముఖ్యమైన భాగంగా ఉన్నాడు. పాకిస్థాన్ జట్టులో షహీన్ అఫ్రిది 10వ నంబర్ జెర్సీని ధరించాడు. షాహిద్ అఫ్రిది కారణంగా అతను ఇలా చేశాడు. షాహీన్‌ చిన్నప్పటి నుంచి షాహిద్‌ అఫ్రిదీని హీరోగా చూసేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో జెర్సీ నంబర్ 10 ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. అతని విజ్ఞప్తి అంగీకరించిన పాక్ బోర్డు 10వ నంబర్ జెర్సీని అందించింది. షాహీన్ ఇప్పటివరకు 19 టెస్టుల్లో 76 వికెట్లు, 28 వన్డేల్లో 53 వికెట్లు, 35 టీ20 మ్యాచుల్లో 38 వికెట్లు పడగొట్టాడు.