
Suryakumar Yadav Record: ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2వ వన్డేలో సూర్యకుమార్ యాదవ్ సిక్సులతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 6వ నంబర్‌తో మైదానంలోకి దిగిన సూర్య.. ఆరంభం నుంచే తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.

ముఖ్యంగా కెమరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ 4 సిక్సర్లు బాదాడు. అంతే కాకుండా కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

విశేషమేమిటంటే, ఈ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.

ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2013లో ఆస్ట్రేలియాపై కింగ్ కోహ్లి కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.

సూర్యకుమార్ యాదవ్ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి కింగ్ కోహ్లీ పేరిట ప్రత్యేక రికార్డును బ్రేక్ చేశాడు

ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 6 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమ్ ఇండియా స్కోరు 399కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.