Surya Kumar Yadav: వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో సూర్య 3 సిక్సర్లు కొడితే భారత్ తరఫున టీ20 సిక్సర్ల సెంచరీ పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా అవతరిస్తాడు. ఇంకా టీ20 క్రికెట్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన మూడో టీమిండియా క్రికెటర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు.
ఇప్పటివరకు భారత్ తరఫున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే వంద కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టి సిక్సర్ల సెంచరీని నమోదు చేశారు. అంటే వారికి మాత్రమే సొంతమైన ఆ లిస్టులోకి చేరడానికి సూర్య మరో 3 సిక్సర్లు కొడితే సరిపోతుంది.
ఇక భారత్ తరఫున అత్యధిక టీ20 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 148 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ ఏకంగా 182 సిక్సర్లు కొట్టాడు.
అలాగే రోహిత్ తర్వాత స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 115 మ్యాచ్‌లు ఆడి 117 టీ20 సిక్సర్లు బాదాడు.
ఈ లిస్టుల కేఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. రాహుల్ 72 టీ20 మ్యాచ్‌లు ఆడి 99 సిక్సర్లు కొట్టాడు. కేఎల్ రాహుల్ సెంచరీకి దగ్గరగా ఉన్నప్పటికీ గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు.
సూర్య కుమార్ యాదవ్ భారత్ తరఫున అత్యధికంగా టీ20 సిక్సర్లు కొట్టిన 4వ ఆటగాడిగా ఇప్పుడు కొనసాగుతున్నాడు. 49 మ్యాచ్‌ల్లోనే 97 సిక్సర్లు కొట్టిన సూర్య.. మరో 3 సిక్సర్లు కొడితే సిక్సుల సెంచరీతో పాటు కేఎల్ రాహుల్‌ని కూడా అధిగమిస్తాడు.
2011 వన్డే వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ఈ లిస్టులో 5వ స్థానంలో ఉన్నాడు. తన కెరీర్‌లో 58 మ్యాచ్‌లు ఆడిన యూవీ 74 సిక్సర్లు కొట్టాడు.