T20 Cricket: టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ సరికొత్త రికార్డ్.. లిస్టులో ధోని ఎక్కడున్నాడంటే?

|

Sep 04, 2024 | 12:56 PM

Imran Tahir Record: కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడుతూ దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అది కూడా 45 ఏళ్ల వయసులో జట్టుకు నాయకత్వం వహించడం విశేషం.

1 / 5
Imran Tahir Record: టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ సరికొత్త చరిత్రను లిఖించాడు. అది కూడా 45 ఏళ్లకే కెప్టెన్‌గా బరిలోకి దిగడం విశేషం. అంటే, ఇమ్రాన్ తాహిర్ ఇప్పుడు టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అత్యధిక వయసుగల ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

2 / 5
ఇమ్రాన్ తాహిర్ ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీని ద్వారా టీ20 క్రికెట్‌లో జట్టుకు సారథ్యం వహించిన అతి పెద్ద వయసు కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.

3 / 5
గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వార్న్ పేరిట ఉండేది. 2013 బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుకు వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో అతని వయస్సు 43 సంవత్సరాలు, 115 రోజులు.

4 / 5
ఇప్పుడు ఈ రికార్డును ఇమ్రాన్ తాహిర్ బద్దలు కొట్టాడు. 45 సంవత్సరాల వయస్సులో, అతను T20 క్రికెట్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న అత్యధిక వయసు గల ఆటగాడిగా నిలిచాడు.

5 / 5
ఐపీఎల్‌లో జట్టుకు నాయకత్వం వహించిన అతి పెద్ద వయసు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు సృష్టించాడు. 41 ఏళ్ల ధోనీ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించి ఈ రికార్డు సృష్టించాడు.