ICC World Cup 2023: వన్డే క్రికెట్‌లో ఈ ఏడుగురి ఆట అద్భుతం.. మెగా టోర్నీలో రాణిస్తే వరల్డ్ కప్ వీరి జట్టుదే..!

|

Sep 30, 2023 | 5:01 PM

ICC ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు వార్మప్‌ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాయి. అయితే టోర్నీ ఆడబోతున్న 10 జట్ల నుంచి ఓ ఏడుగురు ప్లేయర్ల మీదనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే వన్డే క్రికెట్‌లో ఆ ప్లేయర్ల ఆట అద్భుతం, అనిర్వచనీయం. క్రీజుల్లో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు ఖాయం. ఇంతకీ ఎవరు ఈ ప్లేయర్లు..? మీరు అనుకుంటున్న ప్లేయర్లు కూడా ఈ ఏడుగురిలో ఉన్నారా..? చూద్దాం రండి..

1 / 7
1. విరాట్ కోహ్లీ (భారత్): ఛేజింగ్ మాస్టర్‌ ప్రసిద్ధి చెందిన విరాట్ కోహ్లీ భారత్‌కి మరో వరల్డ్ కప్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన కోహ్లీ వన్డే క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడు కూడా. ఇప్పటి వరకు 281 వన్డేలు ఆడిన కోహ్లీ 57.38 సగటుతో మొత్తం 18083 పరుగులు చేశాడు. ఇందులో 47 సెంచరీలు, 66 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. కోహ్లీ ఇదే రీతిలో మెగా టోర్నీలో ఆడితే భారత్ మూడో వరల్డ్ కప్ గెలుచుకోవడాన్ని ఎవరూ ఆపలేరు.

2 / 7
2. బాబర్ ఆజామ్ (పాకిస్థాన్): పాకిస్థాన్ జట్టు తమ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎందుకంటే పాకిస్థాన్ తరఫున నిలకడగా రాణిస్తున్న బాబర్ వన్డే క్రికెట్‌లో 108 మ్యాచ్‌లు ఆడి 58.2 సగటుతో మొత్తం 6069 పరుగులు చేశాడు. ఇందులో బాబర్ పేరిట 19 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు కూడా  ఉన్నాయి.

3 / 7
3. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా): వన్డే క్రికెట్‌లో మరో అద్భుత ఆటగాడు స్టీవ్ స్మిత్. ఆస్ట్రేలియాకి మిడిల్ ఆర్డర్‌‌లో స్టీవ్ స్మిత్ మూలస్తంభం. పైగా స్మిత్‌కి వన్డే క్రికెట్‌ 145 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది. స్మిత్ వన్డేల్లో 44.3 యావరేట్, 12 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలతో మొత్తం 5765 పరుగులు చేశాడు. టోర్నీలో కూడా స్మిత్ తన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిస్తే కంగారుల ప్రత్యర్థి జట్లకు కంగారు పుట్టడం ఖాయం.

4 / 7
4- రోహిత్ శర్మ (భారత్): భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆట అనిర్వచనీయం. ఇప్పటికే వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు బాదిన రోహిత్ వరల్డ్ కప్ 2019 టోర్నీలో ఏకంగా 5 సెంచరీలతో ప్రత్యర్థులపై విజృంభించాడు. సిక్సర్లతోనే సెంచరీ చేయగల సత్తా ఉన్న రోహిత్ ఇప్పటివరకు 251 వన్డే మ్యాచ్‌లు ఆడి 48.85 యావరేజ్‌తో పాటు 30 సెంచరీలు, 52 అర్థ సెంచరీలతో మొత్తం 11170 పరుగులు సాధించాడు. 2019 వరల్డ్ కప్ మాదిరిగానే 2023 మెగా టోర్నీలో కూడా రోహిత్ సెంచరీలు చేస్తే భారత్ ఖాతాలో మూడో కప్ చేరడం ఖాయం.

5 / 7
5- కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్): బ్లాక్ క్యాప్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతమైన బ్యాటర్. ఎప్పుడూ ప్రశాంతమైన నవ్వుతో ఉండే కేన్ మామ.. బ్యాటింగ్‌లో మాత్రం చుక్కలు చూపించగల సత్తా ఉన్న ప్లేయర్. పైగా కివీస్ తరఫున 161 వన్డే మ్యాచ్‌లు ఆడి అనుభవం కూడా ఉంది. వన్డేల్లో కేన్ విలియమ్సన్ 47.85 సగటు, 13 సెంచరీలు, 42 అర్థసెంచరీలతో మొత్తం 6555 పరుగులు చేశాడు. ఈ బ్లాక్ క్యాప్ ప్లేయర్‌లో టోర్నీలో రాణిస్తే.. న్యూజిలాండ్‌కి తొలి వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉంటుంది.

6 / 7
6. జో రూట్ (ఇంగ్లాండ్): ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మ్యాన్ జో రూట్ టెస్ట్ స్పెషలిస్టుగానే కాక బాధ్యతాయుతమైన వన్డే ఆటగాడిగా కూడా ప్రసిద్ధి. ఇప్పటికే 162 వన్డేలు ఆడిన రూట్ 48.8 సగటుతో మొత్తం 7204 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇలాంటి రికార్డ్‌లు కలిగిన రూట్ టోర్నీలో రాణిస్తే.. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలో దిగుతున్న ఇంగ్లాండ్ జట్టుకు మాయబలం లభించినట్లే.

7 / 7
7. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా జట్టుకు అనుభవజ్ఞుడైన ఓపెనర్ డేవిడ్ వార్నర్. తన విధ్వంసకర బ్యాటింగ్‌ ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన వార్నర్‌కి వన్డేల్లో 150 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఈ క్రమంలో వార్నర్ 20 సెంచరీలు, 31 అర్థ సెంచరీలతో 6397 పరుగులు చేశాడు. ఈ ప్రపంచ కప్‌లోనూ అనుభవజ్ఞుడైన ఓపెనర్‌గానే ఆసీస్ తరఫున ఆడుతున్న వార్నర్ పరుగులు వరద పారేలా చేస్తే.. కంగారుల ఖాతాలో 6వ వరల్డ్ కప్ చేరినట్లే.