
సంజూ శాంసన్ టీమిండియాకు దూరమైనా ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తుంటాడు. అయితే, ఈసారి శాంసన్ తనలోని మానవతా లక్షణాలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సంజూ శాంసన్ రూ.15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఈ పదిహేను కోట్లలో రూ.2 కోట్లు పేద ప్రతిభావంతులైన వారికి కేటాయించాడంట.

ఈ విషయాన్ని బయటపెట్టింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఫిట్‌నెస్ ట్రైనర్ రాజమణి ప్రభు. దీనిపై ప్రభు మాట్లాడుతూ.. సంజూ శాంసన్‌కి చాలా ఫ్రాంచైజీల నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే, అతను రాజస్థాన్ రాయల్స్‌తో కొనసాగాలని నిర్ణయించుకున్నాడంట.

రాజస్థాన్ రాయల్స్‌ను మళ్లీ ఛాంపియన్‌గా నిలపాలని కలలు కంటున్నాడు. ఇందుకోసం ఆయన ఎలాంటి ఆఫర్‌ను అంగీకరించలేదు. రాజస్థాన్ రాయల్స్ రూ.15 కోట్లు చెల్లిస్తోంది.

అయితే, ఈ పదిహేను కోట్లలో రూ. 2 కోట్లను పేద ప్రతిభావంతుల కోసం శాంసన్ కేటాయించాడంట. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన యువ ప్రతిభావంతులైన క్రికెటర్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడు.

అలాగే, ప్రతిభావంతులైన పిల్లలకు సంజూ శాంసన్ ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్కడా క్లెయిమ్ చేయలేదు. ఎవరికీ తెలియకుండా తన జీతంతో ఎంతో మందికి సాయం చేస్తున్నారని రాజమణి ప్రభు చెప్పుకొచ్చారు.

ఈ విషయం తెలియగానే సోషల్ మీడియాలో సంజూ శాంసన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. యువ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ ఈసారైనా భారత జట్టులో అవకాశం దక్కించుకోవాలని భావిస్తున్నాడు.