
IPL 2024 మొదటి మ్యాచ్ అనేక రికార్డులకు వేదికగా నిలిచింది. అలాగే కొన్ని ఫన్నీ సన్నివేశాలతో కనిపించింది. ఇందులో, IPL అత్యంత సీనియర్ ఆటగాళ్ళలో ఒకరైన దినేష్ కార్తీక్ తన ప్రత్యేక షాట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ స్పెషల్ షాట్ కొట్టడంతో అతను కూడా ఒక్క క్షణం షాక్ అయ్యాడు.

మ్యాచ్ 20వ ఓవర్లో తుషార్ దేశ్ పాండే వేసిన బంతిని దినేష్ కార్తీక్ రివర్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్ దిగువకు తగిలి నేరుగా లెగ్ సైట్‌లోని బౌండరీ లైన్‌ను దాటింది.

20వ ఓవర్ మూడో బంతికి దినేశ్ కార్తీక్ అద్వితీయమైన షాట్ ఆడాడు. దినేష్ కార్తీక్ ఏ షాట్ కొట్టాడనే విషయంపై వ్యాఖ్యాతలు కాసేపు అయోమయంలో పడ్డారు. ఇలాంటి షాట్ క్రికెట్ బుక్‌లో లేదంటూ కామెంట్ చేశారు.

ఎంఎస్ ధోనీ మాదిరిగానే దినేష్ కార్తీర్‌కు కూడా ఇదే చివరి ఐపీఎల్ టోర్నీ. ఈసారి తొలి మ్యాచ్‌లోనే కార్తీక్ ఈ తరహా ప్రత్యేకమైన షాట్‌ను ఆడి మంచి బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.