Ashwin: సెంచరీ టెస్టులో 36వ సారి.. ధర్మశాలలో చరిత్ర సృష్టించిన అశ్విన్.. అదేంటంటే?

|

Mar 09, 2024 | 9:38 PM

Ashwin Records: ఇంగ్లండ్‌తో జరిగిన 5వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఐదు వికెట్లు తీసి ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ రికార్డుల ద్వారా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన ప్రపంచంలో మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ లిస్టులో తొలి రెండు స్థానాల్లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

1 / 6
ధర్మశాలలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) 2వ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ ఐదు వికెట్లతో టెస్టుల్లో టీమిండియా తరపున అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన రికార్డును లిఖించాడు.

2 / 6
అంటే టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది.

3 / 6
టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 35 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డును చెరిపేసి రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.

4 / 6
భారత్ తరపున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ మొత్తం 36 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. దీని ద్వారా 100వ మ్యాచ్‌లో టీమిండియా తరుపున 5 వికెట్లు తీసిన ప్రత్యేక రికార్డును సాధించడంలో అశ్విన్ సఫలమయ్యాడు.

5 / 6
శ్రీలంక స్పిన్‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 133 టెస్టు మ్యాచ్‌లు ఆడిన మురళీధరన్ 67 సార్లు 5 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

6 / 6
ఇప్పుడు ఈ జాబితాలో 36వ సారి 5 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ 3వ స్థానంలో నిలిచాడు. 37 సార్లు 5 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వార్న్ రెండో స్థానంలో నిలవడంతో రానున్న టెస్టు మ్యాచ్‌ల ద్వారా రవిచంద్రన్ అశ్విన్ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.