IPL 2021: జట్టు మాత్రం ఫ్లాప్.. వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్న పంజాబ్ కెప్టెన్.. తొలి భారతీయుడిగా అరుదైన రికార్డు.. అదేంటంటే?

|

Oct 04, 2021 | 7:13 AM

KL Rahul: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ టీం ఎంతో కష్టపడుతోంది. కానీ, పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాట్ మాత్రం నిరంతరం పరుగులు చేస్తూనే ఉంది.

1 / 5
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఎప్పుడూ వెనుకంజలోనే ఉంటుంది. ఐపీఎల్ 2021 లోనూ అదే పరిస్థితి. మరోసారి ప్లేఆఫ్‌కు వెళ్లడానికి జట్టు కష్టపడుతోంది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ జట్టు పంజాబ్‌ను ఓడించి, ప్లేఆఫ్‌కు వెళ్లింది. పంజాబ్ నిస్సందేహంగా ఫ్లాప్ షో చేసింది. కానీ, పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం నిలకడగా పరుగులు చేస్తూనే ఉన్నాడు. రికార్డులను తిరగరాస్తూ వెళ్తున్నాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ భారతీయుడూ చేయలేని పనిని రాహుల్ చేశాడు.

2 / 5
ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఈ సీజన్‌లో 500 పరుగులు పూర్తి చేశాడు. రాహుల్ ఐపీఎల్‌లో నాలుగు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మె‌న్‌గా మారాడు. అతనికి ముందు ఏ ఇతర భారత బ్యాట్స్‌మె‌న్‌ కూడా నాలుగు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు.

3 / 5
2018 లో రాహుల్ 659 పరుగులు చేశాడు. 54.91 సగటుతో ఈ పరుగులు సాధించాడు. 2019 లో అతని బ్యాట్ నుంచి 593 పరుగులు వచ్చాయి. ఈ సీజన్‌లో 53.90 సగటుతో పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో రాహుల్ ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ 2020 లో రాహుల్ 55.83 సగటుతో 670 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కూడా రాహుల్ ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. 2021 సీజన్‌లో రాహుల్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడి 528 పరుగులు చేశాడు. 52.80 సగటుతో పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

4 / 5
రాహుల్ కంటే ముందు ఇద్దరు భారత క్రికెటర్లు రెండు వరుస సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించగలిగారు. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 2010, 2011 లో రెండు వరుస సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 2015, 2016 లో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

5 / 5
మరోవైపు విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే డేవిడ్ వార్నర్ చాలాసార్లు 500 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో వార్నర్ ఒక సీజన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించే పనిలోనే ఉండేవాడు. వరుసగా నాలుగు సీజన్లలో వార్నర్ 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.