Babar Azam Record: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో బాబర్ అజామ్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అది కూడా ఇప్పటివరకు ఎవరూ చేయని రికార్డ్‌ని నెలకొల్పాడు.
ఈ మ్యాచ్‌లో 53 పరుగులు చేయడం ద్వారా బాబర్ తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. పాకిస్తాన్ తరపునే కాదు, ప్రపంచ క్రికెట్ లోనూ తన సత్తా చాటాడు.
గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. హషీమ్ తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 17 సెంచరీలు, 25 అర్ధసెంచరీలతో 4946 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
బాబర్ అజామ్ 100 వన్డే ఇన్నింగ్స్‌లలో 5142 పరుగులు సాధించాడు. దీంతో 100 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన హషీమ్ ఆమ్లా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
అంతే కాకుండా తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 17 సెంచరీలు చేసిన ఆమ్లా పేరిట ఈ రికార్డు ఉంది. ఇప్పుడు బాబర్ ఆజం 18 సెంచరీలతో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
బాబర్ అజామ్ వన్డే క్రికెట్‌లోని మొదటి 100 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.
టీమిండియా తరపున తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు. ధావన్ 100 ఇన్నింగ్స్‌ల్లో 13 సెంచరీలు, 25 అర్ధసెంచరీలతో 4343 పరుగులు చేశాడు.
భారత జాబితాలో విరాట్ కోహ్లీ 2వ స్థానంలో ఉన్నాడు. కింగ్ కోహ్లీ తన తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌లో 13 సెంచరీలు, 23 అర్ధసెంచరీలతో 4230 పరుగులు సాధించాడు.
ఇప్పుడు బాబర్ అజామ్ వారందరినీ అధిగమించి తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే 5000కు పైగా పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.