IPL 2026: ఎవర్రా మీరంతా.. 35 మ్యాచ్‌లు, 129 సిక్స్‌లు.. తోపు లిస్ట్‌లో టాప్ పేరు చూస్తే షాకే..?

Updated on: Apr 26, 2026 | 3:59 PM

IPL 2026 Most Sixes: ఐపీఎల్ 2026 ఉత్కంఠ దశకు చేరుకుంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్ల ధాటికి రికార్డులు మారిపోతున్నాయి. ముఖ్యంగా సిక్స్ ల విషయంలో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ఒకరినిమింది మరొకరు అన్నట్లు దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో అత్యధిక సిక్స్ లు బాదిన బ్యాటర్లు ఎవరో ఓసారి చూద్దాం..

1 / 5
IPL 2026 Most Sixes: ఐపీఎల్ అంటేనే పరుగుల విందు, సిక్సర్ల హోరు. అయితే 19వ సీజన్ (2026) మాత్రం బ్యాటర్ల రాజ్యంగా మారిపోయింది. బౌలర్ ఎవరైనా, బంతి వేగమెంతైనా సరే.. అది నేరుగా స్టేడియం బయట పడాల్సిందే అన్నట్టుగా సాగుతోంది ఈ ప్రయాణం. ముఖ్యంగా యువ ఆటగాళ్లు భయం అంటే తెలియకుండా అంతర్జాతీయ దిగ్గజ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన 35 మ్యాచ్‌లలో సిక్సర్ల వర్షం కురిపిస్తున్న టాప్ 5 బాహుబలుల జాబితాను ఒకసారి చూద్దాం.

2 / 5
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో ఒక సంచలనం. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే బుమ్రా, ప్యాట్ కమిన్స్ వంటి బౌలర్లను చిత్తు చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఆడిన 8 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 32 సిక్సర్లు బాది ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇతని నిడరమైన బ్యాటింగ్ శైలి చూస్తుంటే మైదానాలు చిన్నబోతున్నాయి.

3 / 5
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఫామ్‌ను కొనసాగిస్తూ రెండో స్థానంలో ఉన్నాడు. 8 ఇన్నింగ్స్‌లలో 28 సిక్సర్లు బాదిన అభిషేక్, పవర్‌ప్లేలో బౌలర్లకు పీడకలలా మారాడు. మొదటి బంతి నుండే దాడి చేయడంలో ఇతను దిట్ట. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 25 సిక్సర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ జట్టు అజేయంగా కొనసాగడంలో ఇతని పవర్ హిట్టింగ్ కీలకంగా మారింది.

4 / 5
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మధ్య ఓవర్లలో స్పిన్నర్లపై దాడి చేస్తూ 23 సిక్సర్లు నమోదు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒత్తిడికి లోనవ్వకుండా భారీ షాట్లు ఆడటం పాటిదార్ ప్రత్యేకత. తన జట్టును ముందుండి నడిపిస్తూ బ్యాటింగ్‌లో కొత్త మెరుపులు మెరిపిస్తున్నాడు. ఆర్సీబీ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు పాటిదార్‌ బ్యాటింగ్‌పైనే ఉన్నాయి. జైపూర్ స్టేడియంలో ఇతని సిక్సర్లు కనువిందు చేస్తున్నాయి.

5 / 5
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వరుసగా సిక్సర్లు బాదుతూ 6 ఇన్నింగ్స్‌ల్లోనే 21 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో స్థిరంగా ఆడుతూనే అవసరమైనప్పుడు గేర్ మార్చి బంతిని గగన విహారం చేయిస్తున్నాడు. అయ్యర్ ఫామ్ పంజాబ్ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది. ఈ సీజన్ టాప్ సిక్సర్ హిట్టర్ల జాబితాలో ఒక సీనియర్ ప్లేయర్‌గా తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాడు.

Follow Us