IPL 2023, MI & RCB: బెంగళూరు తరఫున ఆడుతున్న ముంబై మాజీ ప్లేయర్లు.. వీళ్లతోనూ రోహిత్ సేన ‘ప్లేఆఫ్స్‌’కి గండం..

|

May 21, 2023 | 8:59 PM

గుజరాత్‌పై విజయం సాధించి రోహిత్ సేనను ప్లేఆఫ్స్ నుంచి తొలగించాలని ఆర్‌సీబీ చూస్తోంది. ఇక్కడ విశేషమేమిటంటే.. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ముగ్గురు మాజీ ఆటగాళ్ళు ఇప్పుడు ఆర్‌సీబీ శిబిరంలో ఉన్నారు.

1 / 6
ఐపీఎల్ 2023: ఐపీఎల్ లీగ్ దశ దాదాపుగా ముగిసింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్‌లోకి ప్రవేశించాయి. ఇక 4వ స్థానం కోసం ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ నెలకొంది.

2 / 6
లీగ్ 69వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉంది. మరోవైపు 70వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి ముంబై స్థానాన్ని ఆక్రమించాలని ఆర్‌సీబీ చూస్తోంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిస్తే ముంబై ఇండియన్స్‌తో సమానంగా 16 పాయింట్లు ఉంటాయి. అయితే ముంబై ఇండియన్స్ కంటే ఆర్‌సీబీ రన్‌రేట్ మెరుగ్గా ఉన్నందున బెంగళురు టీమ్ నాల్గో ప్లేఆఫ్స్ ఆడుతుంది.

3 / 6
ఈ ఉత్తేజకరమైన దశలో.. గుజరాత్‌పై విజయం సాధించి రోహిత్ సేనను ప్లేఆఫ్స్ నుంచి తొలగించాలని ఆర్‌సీబీ చూస్తోంది. ఇక్కడ విశేషమేమిటంటే.. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ముగ్గురు మాజీ ఆటగాళ్ళు ఇప్పుడు ఆర్‌సీబీ శిబిరంలో ఉన్నారు. మరి ఆ ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

4 / 6
1: గ్లెన్ మాక్స్‌వెల్: RCB తరఫున ‘కేజీఎఫ్’లో భాగంగా ఉన్న స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ 2013లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. అలాగే రోహిత్ శర్మ నాయకత్వంలో 3 మ్యాచ్‌లు ఆడి.. మొత్తం 36 పరుగులు చేశాడు.

5 / 6
2: దినేష్ కార్తీక్: RCB వికెట్ కీపర్, బ్యాట్స్‌మ్యాన్ దినేష్ కార్తీక్ కూడా 2012, 2013 ఐపీఎల్ సీజన్‌లలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. అలాగే ముంబై తరఫున 19 మ్యాచ్‌లు ఆడిన డీకే మొత్తం 510 పరుగులు చేసి రాణించాడు.

6 / 6
3: కర్ణ్ శర్మ: RCB జట్టులోని లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడే. 2017లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన కర్ణ్ శర్మ 13 వికెట్లు పడగొట్టి రాణించాడు.