34 బంతుల ఊచకోత.. 9 సిక్సర్లతో హార్దిక్ ఫ్రెండ్ శివతాండవం.. ఎవరంటే.?

|

Aug 18, 2024 | 11:49 AM

ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన షిమోగా జట్టు.. అభినవ్ మనోహర్ ఒంటరి పోరాటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. రోహన్ పాటిల్ హాఫ్ సెంచరీతో ఈ లక్ష్యాన్ని ఛేదించిన..

1 / 6
బెంగళూరు వేదికగా జరుగుతున్న మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లోని ఐదో మ్యాచ్‌లో షిమోగా, మంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మంగళూరు 22 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో షిమోగాపై అద్భుత విజయం సాధించింది మంగళూరు టీం.

2 / 6
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన షిమోగా జట్టు.. అభినవ్ మనోహర్ ఒంటరి పోరాటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. రోహన్ పాటిల్ హాఫ్ సెంచరీతో ఈ లక్ష్యాన్ని ఛేదించిన అత్యంత సునాయాసంగా చేధించింది మంగళూరు డ్రాగన్స్ టీం.

3 / 6
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన షిమోగా జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌గా వచ్చిన జట్టు కెప్టెన్ నిహాల్ ఉల్లాల్ సున్నాకి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ రోహిత్ 20 బంతుల్లో 4 బౌండరీలతో 24 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. మూడో స్థానంలో వచ్చిన ధృవ్ 20 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు ఆరంభం స్టార్టింగ్‌లో మందకొడిగా సాగింది.

4 / 6
అభినవ్ మనోహర్ పిడుగులాంటి బ్యాటింగ్‌తో జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. అభినవ్ ఒంటిచేత్తో 34 బంతుల్లో 3 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు చేశాడు. అటు 21 బంతుల్లో 22 పరుగులు చేసిన అవినాష్ కూడా అతనికి మంచి సహకారం అందించాడు. దీంతో ఆ జట్టు 175 పరుగులు చేసింది.

5 / 6
 ఈ లక్ష్యాన్ని ఛేదించిన మంగళూరు జట్టుకు ఓపెనర్లు పేలుడు ఆరంభాన్ని అందించారు. దీంతో ఆ జట్టు తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలో 75 పరుగులు చేసింది. ఈ సమయంలో మెక్‌నీల్ హ్యాడ్లీ నొరోన్హా 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

6 / 6
మరో ఓపెనర్ రోహన్ పాటిల్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. చివర్లో 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 38 పరుగులు చేసిన కె. సిద్ధార్థ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.