రెండు రోజుల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్ మొదటి సెమీస్ మ్యాచ్‌లో పాకిస్తాన్ vs న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. పాక్ న్యూజిలాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను పక్కనబెట్టి ఓ పాకిస్థానీ అమ్మాయి వైపు తమ దృష్టి పెట్టారు.
వైట్ టీషర్ట్‌పై పాక్ జాతీయ జెండాతో చూడగానే ఎవరీ అమ్మాయి.. అనిపించేలా ఉన్న ఓ యువతి సెమీస్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యాచ్ జరుగుతున్నంతసేపు గాల్లోకి ముద్దులు విసురుతూ బాబర్ సేనను ప్రోత్సహించిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరా అని నెటిజన్లు ఆరా తీశారు.
ఈ అమ్మాయి పేరు నటాషా నాజ్. తాను విరాట్ కోహ్లికి పెద్ద అభిమానిని అని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆమె టీమిండియా ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పింది. అంతేకాదు ఫైనల్స్‌లో ఆదివారం కలుద్దామని మ్యాచ్ తర్వాత ట్వీట్ చేసింది. అయితే దురదృష్టవశాత్తూ భారత్ ఫైనల్ చేరుకోలేకపోయింది.
నటాషా పాక్ సంతతికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుండి ఆస్ట్రేలియాలోనే నివాసముంటోంది. కాగా నటాషా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సెమీస్ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో నటాషా ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు.
నెట్టింట్లో ఇంత ప్రేమను పొందుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని మురిసిపోయిందీ ముద్దుగుమ్మ. మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగే మ్యాచ్‌కు కూడా ఈ ముద్దుగుమ్మ రానుంది. సో.. ఈ అమ్మాయి కోసమైనా మనం ఫైనల్ మ్యాచ్ చూడాల్సిందేనంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.