రెండేళ్లు టెస్ట్ మ్యాచ్ ఆడలేదు.. రీ-ఎంట్రీతోనే అదరగొట్టాడు.. ఆ భారత్ ప్లేయర్ ఎవరంటే.!

|

Aug 06, 2021 | 3:58 PM

ప్రస్తుతానికి ఇంకా ఇంగ్లాండ్ టీమ్ కంటే భారత్ వెనుకబడి ఉన్నా.. క్రీజులో ఉన్న ఈ బ్యాట్స్‌మెన్‌ రెండో రోజు నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తే..

1 / 5
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 125 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఇంకా ఇంగ్లాండ్ టీమ్ కంటే భారత్ వెనుకబడి ఉన్నా.. క్రీజులో ఉన్న ఈ బ్యాట్స్‌మెన్‌ రెండో రోజు నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తే.. టీమిండియాకు ఆధిక్యం దక్కడం ఖాయం. ఇతడు రెండేళ్ళ నుంచి ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడకపోయినా.. ప్రాక్టిస్ మ్యాచ్, తోలి ఇన్నింగ్స్‌లలో అదరగొట్టాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు కెఎల్ రాహుల్.

2 / 5
కెఎల్ రాహుల్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తిరిగి టెస్ట్ జట్టులో చోటు సంపాదించాడు. వచ్చిన వెంటనే సూపర్బ్ ఫిఫ్టీతో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి.

3 / 5
 కెఎల్ రాహుల్ 2018లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టులో ఉన్నాడు. అప్పుడు అతడు అద్భుత శతకంతో చక్కటి ఆటతీరును ప్రదర్శించాడు. అయితే అనూహ్యంగా ఆస్ట్రేలియా, వెస్టిండిస్ పర్యటనలకు సెలెక్టర్లు రాహుల్‌ను ఎంపిక చేయలేదు. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ప్రాక్టిస్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేశాడు.

4 / 5
36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కెఎల్ రాహుల్.. 34.58 సగటుతో 2006 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతడి అత్యధిక స్కోరు 199 పరుగులు.

5 / 5
వికెట్ కీపర్‌గా కూడా కెఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. వన్డే, టీ20ల్లో ఆడుతున్న ఈ ప్లేయర్.. త్వరలోనే టెస్టుల్లో కూడా సుస్థిర స్థానాన్ని సంపాదిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీ20ల్లో రాహుల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.