మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి మాదిరిగానే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకొన్నాడు. అతని ప్రియురాలు అతియా శెట్టితో కలిసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాడు రాహుల్.
కేఎల్ రాహుల్ తన సోషల్ మీడియా ఖాతాలో అథియాతో ఉన్న రొమాంటిక్ ఫోటోలను పంచుకున్నారు. ఇద్దరూ కలిసి బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో ఎంతో అందంగా కనిపించారు.
వీరిద్దరితో పాటు వారి సన్నిహితులు కూడా లవ్ బర్డ్స్ రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.
పెళ్లి కారణంగానే శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ తప్పుకోనున్నట్లు తెలుస్తుంది.