
Joe Root, Ashes 2023: ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మ్యాన్ జో రూట్ యాషెస్‌లో గొప్ప బ్యాటర్‌గానే కాకుండా, మంచి బౌలర్‌గా, అద్భుతమైన ఫీల్డర్‌గా కూడా నిరూపించుకుంటున్నాడు.

లార్డ్స్ మైదానంలో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో రూట్ తన మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉన్న ‘క్యాచ్’ రికార్డును సమం చేశాడు. ఇంకా కుక్ కంటే వేగంగా ఈ ఘనతను సాధించాడు.

ఇంగ్లాండ్ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్‌కీపర్ ప్లేయర్‌గా రూట్ నిలిచాడు. కుక్‌తో సమానంగా 175 క్యాచ్‌లు అందుకున్నాడు.

అయితే కుక్ కంటే అత్యంత వేగంగా 175 క్యాచ్‌లు పట్టి.. ఆ ఘనత సాధించిన ఇంగ్లిష్ ప్లేయర్‌గా కూడా నిలిచాడు. కుక్ 161 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. రూట్ 175వ క్యాచ్ పట్టుకోవడానికి 132 టెస్టులు తీసుకున్నాడు.

ఇంగ్లాండ్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్, కుక్ కాకుండా.. ఆండ్రూ స్ట్రాస్ 121 క్యాచ్‌లతో, ఇయాన్ బోథమ్, కోలిన్ కౌడ్రీ 120 క్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.