IPL 2027: ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్ ఇతనే.? లిస్ట్‌లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు..!

Updated on: Nov 26, 2026 | 12:59 PM

IPL 2027 Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈసారి వేలంలో విదేశీ ఆటగాళ్ల కంటే ముగ్గురు భారత క్రికెటర్లపై ఫ్రాంచైజీలు భారీగా డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంది. దీపక్ చాహర్, నితీష్ రాణా, ఆవేశ్ ఖాన్‌లపై జట్లు ఆసక్తి చూపించవచ్చనే అంచనాలు ఉన్నాయి.

1 / 5
IPL 2027 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 (IPL 2027) మినీ వేలానికి రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఈ వేలం కోసం మొత్తం 1,220 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 939 మంది భారత ఆటగాళ్లు కాగా, 281 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. దీంతో ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్లను దక్కించుకునేందుకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.

2 / 5
సాధారణంగా ఐపీఎల్ వేలంలో విదేశీ ఆటగాళ్లకు భారీ ధర పలుకుతుంది. అయితే ఈసారి మాత్రం ముగ్గురు భారత ఆటగాళ్లు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు వీరి కోసం భారీ మొత్తాన్ని వెచ్చించే అవకాశం ఉంది. ఇంతకీ ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

3 / 5
1. దీపక్ చాహర్: భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ IPL 2027 మినీ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ముంబై ఇండియన్స్ అతడిని విడుదల చేయడంతో వేలంలోకి వచ్చాడు. తన బేస్ ప్రైస్‌ను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు. పవర్‌ప్లేలో స్వింగ్ బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టగల సామర్థ్యం దీపక్ చాహర్ సొంతం. కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల అతడి నైపుణ్యం ఫ్రాంచైజీలకు ఉపయోగపడనుంది. అందుకే అతడి కోసం పలు జట్లు పోటీ పడే అవకాశం ఉంది.

4 / 5
2. నితీష్ రాణా: ఈ జాబితాలో రెండో పేరు భారత బ్యాటర్ నితీష్ రాణా. IPL 2027 వేలం కోసం అతడు రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో అన్క్యాప్డ్ ఆటగాడిగా రిజిస్టర్ చేసుకున్నాడు. 2021 జూలై తర్వాత అతడు భారత జాతీయ జట్టు తరఫున ఆడలేదు. నితీష్ రాణాకు ఒత్తిడిలోనూ దూకుడుగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. మిడిల్ ఆర్డర్‌లో జట్టుకు అవసరమైన పరుగులు చేయగలడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. దీంతో బ్యాటర్‌గానే కాకుండా నాయకత్వ లక్షణాలున్న ఆటగాడిగా కూడా ఫ్రాంచైజీలు అతడిపై ఆసక్తి చూపవచ్చు.

5 / 5
3. ఆవేశ్ ఖాన్: భారత యువ ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ ఈ జాబితాలో మూడో ఆటగాడు. IPL 2027 మినీ వేలం కోసం రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు. తన వేగంతో పాటు డెత్ ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యం ఆవేశ్ ఖాన్‌కు ఉంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 83 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. ఈ అనుభవం అతడికి వేలంలో కలిసిరావచ్చు. ముఖ్యంగా భారత ఫాస్ట్ బౌలర్ల కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీలు ఆవేశ్ ఖాన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us