
ఎప్పటిలాగానే ఐపీఎల్ 17వ సీజన్‌లోనూ బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడుతున్నారు. ఈ ఎంపిక చేసిన బ్యాట్స్‌మెన్‌లు తమ అద్భుతమైన స్ట్రైక్ రేట్‌లతో ప్రత్యర్థి జట్ల బౌలర్లను చిత్తు చేశారు. మరి ఈ సీజన్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన టాప్ -6 బ్యాటర్ల ఎవరో తెలుసుకుందాం రండి.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్‌లలో 212.96 స్ట్రైక్ రేట్‌తో 115 పరుగులు చేశాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రస్సెల్ 25 బంతుల్లో 64 పరుగులు చేశాడు.

భారత్‌కు చెందిన అన్‌క్యాప్‌డ్ ఆటగాడు అభిషేక్ శర్మ హైదరాబాద్ తరఫున ధాటిగా ఆడుతున్నాడు. శర్మ ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 208.23 స్ట్రైక్ రేట్‌తో 177 పరుగులు చేశాడు.

శశాంక్ సింగ్ రూపంలో పంజాబ్ కింగ్స్‌కు గొప్ప ఫినిషర్ లభించాడు. శశాంక్ 195.71 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు. గుజరాత్‌పై అతను 29 బంతుల్లో 61 పరుగులు చేశాడు.

హెన్రిక్ క్లాసెన్ కూడా ఇప్పటివరకు బాగా బ్యాటింగ్ చేశాడు. క్లాసెన్ 5 మ్యాచ్‌ల్లో 186 పరుగులు చేశాడు. అదే సమయంలో, క్లాసెన్ స్ట్రైక్ రేట్ 193.75. ముంబైపై క్లాసెన్ 80 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ట్రిస్టన్ స్ట్రబ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. స్ట్రబ్స్ 5 మ్యాచ్‌ల్లో 193.33 స్ట్రైక్ రేట్‌తో 174 పరుగులు చేశాడు.

అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన సునీల్ నరైన్ 4 మ్యాచ్‌ల్లో 161 పరుగులు చేశాడు. నరైన్ 189.41 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై నరైన్ 85 పరుగులు చేశాడు.