IPL 2024: ముంబై ఇండియన్స్ జట్టులోకి లసిత్ మలింగ రీ-ఎంట్రీ.. రోహిత్ ఖాతాలో మరో టైటిల్ పడినట్లే..

Mumbai Indians, Lasith Malinga: ముంబై ఫ్రాంచైజీ ఇప్పటికే వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఈ క్రమంలో శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. 2008 నుంచి 2020 వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ జట్టు తరపున 122 మ్యాచ్‌లు ఆడిన మలింగ 170 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు.

Venkata Chari

|

Updated on: Oct 21, 2023 | 8:08 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ 2024 ఎడిషన్ ప్రారంభానికి ముందు జట్టులో పెద్ద మార్పు చేసింది. IPL-2024 సీజన్ కోసం ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా నియమించుకుంది. వీరిద్దరూ గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడినవారే కావడం గమనార్హం.

1 / 5
ముంబై ఫ్రాంచైజీ ఇప్పటికే వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఈ క్రమంలో శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. దీనిపై బౌలింగ్ కోచ్ మలింగ మాట్లాడుతూ.. ‘ఎంఐ న్యూయార్క్, ఎంఐ కేప్ టౌన్ లలో ఇప్పటికే నా ప్రయాణం మొదలైంది. ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ కోచ్‌గా నియమితులవడం ఆనందంగా ఉంది' అంటూ తెలిపాడు.

2 / 5
పొలార్డ్, రోహిత్, మార్క్‌లతో పాటు మొత్తం జట్టుతో మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంతో నాకు కొత్త అనుబంధం ఏర్పడింది. ప్రతిభావంతులైన యువ బౌలర్లకు మార్గనిర్దేశం చేయడం విశేషం. నిజానికి షేన్ బాండ్ గతంలో ముంబై జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. కానీ ఫ్రాంఛైజీ అతనితో ఒప్పందం ముగింసింది. దీంతో షేన్ బాండ్‌కు బదులుగా లసిత్ మలింగ జట్టులోకి వచ్చాడు.

3 / 5
మలింగ కూడా 2008 నుంచి 2020 వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ జట్టు తరపున 122 మ్యాచ్‌లు ఆడిన మలింగ 170 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. తర్వాత, 2022, 2023 ఎడిషన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన మలింగ ఇప్పుడు ముంబైకి తిరిగి రానున్నాడు.

4 / 5
అదేవిధంగా, 2013, 2015, 2017, 2019లో ట్రోఫీని గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న మలింగ తన ఖాతాలో నాలుగు టైటిళ్లను కలిగి ఉన్నాడు. 2021లో ఆటగాడిగా పదవీ విరమణ చేసిన తర్వాత, మలింగ బౌలింగ్ కోచ్‌గా మారాడు.

5 / 5
Follow us