
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో శుభారంభం చేయడంలో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ కీలక ఆటగాడు కుల్దీప్ యాదవ్ గాయం సమస్యతో బాధపడుతున్నాడు.

కుల్దీప్ యాదవ్ గ్రోయిన్ ఇంజురీ సమస్యతో బాధపడుతున్నాడని, మరింత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు.

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు దూరమైన కుల్దీప్ యాదవ్ జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడే పునరావాసం పొందనున్నాడు. అంటే టీమ్ ఇండియా ఆటగాళ్లు గాయపడినా లేదా మరేదైనా ఫిట్‌నెస్ సమస్య ఎదుర్కొన్నట్లయితే, వారు ఎన్‌సీఏ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాలి.

అందువల్ల గజ్జల్లో నొప్పితో బాధపడుతున్న కుల్దీప్ యాదవ్ మళ్లీ ఆడాలంటే ఎన్‌సీఏ నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన సీనియర్ స్పిన్నర్ మ్యాచ్‌ల ప్రథమార్థానికి అందుబాటులో ఉండడని దాదాపు ఖాయం.

ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న రిషబ్ పంత్ జట్టుకు అనుభవజ్ఞుడైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గైర్హాజరు పెద్ద దెబ్బేనని చెప్పొచ్చు.