IPL 2023: వేలంలో రూ.13.25 కోట్లు.. కట్‌చేస్తే 13, 3 పరుగులకే ఔట్.. హైదరాబాద్‌కి తలనొప్పిగా మారిన ఇంగ్లాండ్ ఆటగాడు..

|

Apr 08, 2023 | 6:35 AM

ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ రూ.13.25 కోట్లతో సొంతం చేసుకున్న ఆటగాడు ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి తల నొప్పిగా మారాడు. ముందుగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు, అలాగే శుక్రవారం రాత్రి లక్నోపై 3 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో అతని ఆట ఆరెంజ్ ఆర్మీకి తలనొప్పిగా మారింది. ఇంతకు అతనెవరో ఇప్పుడు చూద్దాం..

1 / 6
లక్నో సూపర్‌జెయింట్స్‌తో తన రెండో మ్యాచ్‌ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికీ తొలి విజయాన్ని అందుకోలేకపోయింది. లక్నో స్పిన్నర్ల మాయాజాలంతో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ 121 పరుగులు మాత్రమే చేసి, ప్రత్యర్థి చేతుల్లో 5 వికెట్ల తేడాతో మ్యాచ్ కోల్పోయింది. ముఖ్యంగా ఖరీదైన ధరకు ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన ఒక ఆటగాడు రెండు మ్యాచ్‌ల్లోనూ పరుగులు చేయకపోవడం హైదరాబాద్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

2 / 6
అవును, ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ.. ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్‌మ్యాన్ హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఖరీదైన ధర లభించి జట్టులోకి వచ్చిన బ్రూక్.. బ్యాటింగ్‌లో వైఫల్యాన్ని ఎదుర్కొంటున్నాడు.

3 / 6
లక్నో సూపర్‌జెయింట్స్‌పై 4 బంతులే ఆడిన హ్యారీ బ్రూక్ కేవలం 3 పరుగులే చేయగలిగాడు. అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్‌పై కూడా అతను 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ రెండు మ్యాచ్‌లను కలుపుకుంటే అతను అరగంట కూడా క్రీజులో నిలవలేకపోయాడు.

4 / 6
వాస్తవానికి 1 కోటి 50 లక్షల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్ వేలంలోకి అడుగుపెట్టిన బ్రూక్‌ను ఫ్రాంచైజీ  రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ కూడా బ్రూక్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాయి.

5 / 6
కానీ చివరకు బ్రూక్ హైదరాబాద్ సొంతమయ్యాడు. ఈ క్రమంలో హైదరాబాద్ బ్రూక్‌కు ఇంత డబ్బు చెల్లించడానికి కారణం ఉంది. ఐపిఎల్ ఆడకముందు బ్రూక్ న్యూజిలాండ్‌తో జరిగిన 2 టెస్ట్ సిరీస్‌లో ఒక సెంచరీ, 3 అర్ధసెంచరీలు చేశాడు. అలాగే దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌లపై కూడా బ్రూక్ అద్భుతంగా రాణించాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్రాంచైజీ బ్రూక్‌పై ఆశలు పెట్టుకుని అతని కోసం భారీగా చెల్లించుకుంది.

6 / 6
అయితే ఐపీఎల్‌కి వచ్చిన వెంటనే బ్రూక్ బ్యాట్ మౌనంగా ఉంది. అతను కూడా క్రీజులో నిలబడలేకపోతున్నాడు. బ్రూక్ రానున్న మ్యాచ్‌లలో కూడా ఇలాగే ఆడితే.. వచ్చే సీజన్‌లలో అతను హైదరాబాద్ తరఫున ఆడడం కష్టమే అని చెప్పుకోవాలి. ఇదే క్రమంలో హైదరాబాద్ టీమ్ కూడా రాణించలేకపోతుంది. బ్యాటర్లు, బౌలర్లుగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇక సన్‌రైజర్స్ టీమ్ మరోసారి హైదరాబాద్ వేదికగా రేపు ఆడబోతుంది. రేపు రాత్రి 7.30 నిముషాలకు జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆరెంజ్ ఆర్మీ తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా రూ.13.25 కోట్ల ఆటగాడు హ్యరీ బ్రూక్ రాణిస్తాడో లేదో వేచి చూడాలి..