ఐపీఎల్ 2023: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్‌సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 9వ మ్యాచ్ ద్వారా వెటరన్ స్పిన్నర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డు సృష్టించాడు. అవును, ఆర్‌సీబీతో జరిగిన ఈ మ్యాచ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 150 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా సునీల్ నరైన్ నిలిచాడు.
2012 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న సునీల్ నరైన్ కేకేఆర్ తరఫున మాత్రమే ఆడాడు. అలాగే KKR జట్టు కోసం 150 మ్యాచ్‌లు పూర్తి చేయడం ద్వారా, అతను IPL లో ఒకే జట్టు కోసం 150 మ్యాచ్‌లు ఆడిన 7వ ఆటగాడిగా నిలిచాడు.
అయితే ఐపీఎల్ చరిత్రలో సునీల్ నరైన్ కంటే ముందుగా ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం...
1. విరాట్ కోహ్లీ: 2008 నుంచి అంటే ఐపీఎల్ తొలి సీజన్ నుంచి కూడా విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపునే ఆడుుతున్నాడు. దీంతో అతని కెరీర్‌లో 225 మ్యాచ్‌లు ఆడాడు. దీని ద్వారా ఐపీఎల్‌లో ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ప్రత్యేక రికార్డు సృష్టించాడు.
2. ఎంఎస్ ధోని: ఎంఎస్ ధోని తన ఐపీఎల్ కెరీర్‌లో 236 మ్యాచ్‌లు ఉండగా.. వాటిలో 206 ఆటలను చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే మ్యాచ్‌లు ఆడాడు. తద్వారా మిస్టర్ కూల్ కెప్టెన్ ఈ జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు.
3. కీరన్ పొలార్డ్: ఐపీఎల్ కెరీర్‌లో ముంబై ఇండియన్స్ మాత్రమే ఆడిన కీరన్ పొలార్డ్ కూడా 189 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. దీంతో వెస్టిండిస్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ ఒకే జట్టు తరఫున 150 లేదా అంతకు పైగా మ్యాచ్‌లు ఆడినవారి లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు.
4. రోహిత్ శర్మ: ఐపీఎల్‌లో తొలి 3 సీజన్లకు డెక్కన్ చార్జర్స్ తరఫున ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున మాత్రమే ఆడాడు. ఈ క్రమంలో ముంబై తరఫున హిట్‌మ్యాన్ 183 మ్యాచ్‌లు ఆడి.. ఈ లిస్టులో నాల్గో స్థానంలో ఉన్నాడు.
5.సురేష్ రైనా: చెన్నై టీమ్ మాజీ ఆటగాడు సురేష్ రైనా కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపున 176 మ్యాచ్‌లు ఆడాడు. తద్వారా ఒకే జట్టు తరఫున 150 లేదా అంతకు పైగా మ్యాచ్‌లు ఆడినవారి లిస్టులో రైనా 5వ స్థానాన్ని ఆక్రమించాడు.
6. ఏబీ డివిలియర్స్: ఈ లిస్టులో ఏబీ డివిల్లియర్స్ కూడా ఉన్నాడు. ఆర్‌సీబీ తరఫున మాత్రమే 156 మ్యాచ్‌లు ఆడడం ద్వారా ఈ మిస్టర్ 360 కూడా ఈ జాబితాలో 6వ స్థానంలో ఉన్నాడు.
7. సునీల్ నరైన్: ఇక ఏప్రిల్ 6న ఆర్‌సీబీతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సునీల్ నరైన్‌కి కేకేఆర్ తరఫున అలాగే టోర్నీలో అతనికి 150వ మ్యాచ్. తద్వారా ఈ స్పిన్ మాత్రికుడు కూడా ఒకే జట్టు తరఫున 150 లేదా అంతకు పైగా మ్యాచ్‌లు ఆడినవారి లిస్టులో తాజాగా 7వ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.