రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ 14 ఏళ్ల తర్వాత రాజస్థాన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. బట్లర్, ఈ సీజన్‌లో అనేక రికార్డులను నెలకొల్పాడు. అనేక రికార్డులను కూడా సమం చేశాడు. శుక్రవారం అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మరోసారి చాలా ప్రత్యేకమైన ప్రదర్శన చేశాడు.
మే 27న అహ్మదాబాద్‌లో RCBతో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో, బట్లర్ ఒకసారి రాజస్థాన్ తరపున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి అద్భుతమైన సెంచరీని సాధించాడు. బట్లర్ 60 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ సీజన్‌లో బట్లర్‌కి ఇది నాలుగో సెంచరీ కాగా, 2016లో ఒక సీజన్‌లో 4 సెంచరీలు చేసిన బెంగళూరు మాజీ కెప్టెన్, భారత దిగ్గజం విరాట్ కోహ్లీని సమం చేశాడు.
ఇది మాత్రమే కాదు, ఇప్పటివరకు ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే నిలిచిన ఓ జాబితాలో ప్రస్తుతం బట్లర్ పేరు కూడా చేరింది. బట్లర్ తన సెంచరీ ఇన్నింగ్స్‌లో IPL 2022లో తన 800 పరుగులను కూడా పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 824 పరుగులు చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా బట్లర్ నిలిచాడు. అతని కంటే ముందు డేవిడ్ వార్నర్ (848), విరాట్ కోహ్లీ (973-రికార్డు) మాత్రమే ఈ ఘనత సాధించారు. యాదృచ్ఛికంగా, 2016 సీజన్‌లో బ్యాట్స్‌మెన్ ఇద్దరూ పరుగుల వర్షం కురిపించారు. కోహ్లి రికార్డును బద్దలు కొట్టడం కష్టమే అయినా ఫైనల్‌లో వార్నర్‌ను అధిగమించే ఛాన్స్ ఉంది.