
IPL 2021: ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌లు వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. యూఏఈలో జరగనున్న ఈ మెగా టోర్నీకి చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. సీఎస్‌కే దిగ్గజ ఆటగాళ్లు వారి ఫ్యామిలీలతో యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. చాలా మంది సీఎస్‌కే ఆటగాళ్లు కూడా దుబాయ్ చేరుకున్నారు. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు.

ఈ మేరకు సీఎస్‌కే కూడా దుబాయ్‌లోని హోటల్ చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఐపీఎల్ 2021లో మిగిలిన 31 మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 10న జరుగుతుంది. టోర్నమెంట్ రెండవ దశలో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుంది.

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు యూఈఏ చేరుకున్నాక చాలా ప్రశాంతంగా కనిపించారు. జట్టులోని యువ ఆటగాళ్లతో ధోని చర్చల్లో ఫుల్ బిజీగా కనిపించాడు.

సీఎస్‌కే బృందం ప్రస్తుతానికి క్వారంటైన్‌లో ఉండనుంది. ఆ తర్వాత వారు ఐపీఎల్ 2021 కోసం తమ ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నారు.