2 ఓవర్లు, 8 పరుగులు.. హ్యాట్రిక్‌తో 4 వికెట్లు.. ముంబైలో టీమిండియాకు చుక్కలు.. చరిత్ర సృష్టించిన బౌలర్ ఎవరంటే?

|

Dec 21, 2022 | 6:35 AM

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి భారత జట్టు ఘోర పరాజయానికి కారణమైంది.ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించింది. టీ20 ఇంటర్నేషనల్‌లో తన దేశానికి చెందిన రెండవ ప్లేయర్‌గా నిలిచింది.

1 / 5
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఐదో, చివరి టీ20లో భారత జట్టుపై ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో ఆస్ట్రేలియా బౌలర్ చరిత్ర సృష్టించింది. ఈ ప్లేయర్ పేరు హీథర్ గ్రాహం.

2 / 5
ఈ మ్యాచ్‌లో గ్రాహం హ్యాట్రిక్‌ సాధించింది. దీంతో టీ20 ఇంటర్నేషనల్‌లో హ్యాట్రిక్‌ సాధించిన ఆస్ట్రేలియా రెండో మహిళా బౌలర్‌గా రికార్డు సృష్టించింది. అంతకు ముందు మేగాన్ షట్ హ్యాట్రిక్ సాధించింది.

3 / 5
రెండు ఓవర్లలో గ్రాహమ్ ఈ హ్యాట్రిక్ సాధించింది. 13వ ఓవర్ వేసిన గ్రాహం ఐదు, ఆరో బంతుల్లో వికెట్లు పడగొట్టింది. దేవికా వైద్య (11), రాధా యాదవ్ (0)ను పెవిలియన్ చేర్చింది. ఆ తర్వాత 20వ ఓవర్ తొలి బంతికి రేణుకా సింగ్ (2)ను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసింది.

4 / 5
ఈ ఓవర్ చివరి బంతికి వికెట్ కూడా పడగొట్టింది. ఈ ఓవర్ చివరి బంతికి దీప్తిని గ్రాహం అవుట్ చేసింది. గ్రాహం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఎనిమిది పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది.

5 / 5
ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌పై హ్యాట్రిక్ సాధించారు. ఈ ఇద్దరూ ముంబైలోనే హ్యాట్రిక్ చేయడం విశేషం.