3. కేఎల్ రాహుల్: ఆడని మ్యాచ్‌లు: టెస్ట్-15, ODI-2, T-20-13: 2020లో న్యూజిలాండ్ పర్యటనలో మొత్తం 5 T20లు, 3 ODIలు ఆడాడు. కానీ, 2 టెస్ట్‌లకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాలో 3 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. కానీ, గాయపడి 2 టెస్టులు ఆడలేదు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో హోమ్ టెస్టు ఆడలేదు. కానీ 5 టీ20ల్లో 4, 3 వన్డేలు ఆడాడు. ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టులు ఆడాడు. దీని తర్వాత ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ రెండో దశలో బరిలోకి దిగాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు T20Iలలో రెండు ఆడాడు. కానీ, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు గాయపడ్డాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు ఫిట్‌గా ఉన్నాడు. రెండో టెస్టు, మూడు వన్డేల్లో కూడా అతను జట్టుకు నాయకత్వం వహించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల్లో ఒకదానిని ఆడి, ఆపై సిరీస్‌కు దూరమయ్యాడు. శ్రీలంకతో ఏ ఫార్మాట్ ఆడలేదు. కానీ, IPL 2022కి ముందు ఫిట్‌గా ఉన్నాడు. దీని తర్వాత జూన్‌లో దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఒకరోజు ముందు గాయపడ్డాడు. అతను సెప్టెంబర్ వరకు తిరిగి వచ్చే అవకాశం లేదు.