బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. బొటనవేలు గాయం కారణంగా మూడవ వన్డే, మొదటి టెస్ట్ మ్యాచ్‌కు దూరయ్యాడు. ఇప్పుడు రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులో లేడు. దీని ఫలితంగా 2013 నుంచి రోహిత్ ట్రాక్ రికార్డ్‌కు బ్రేక్ పడినట్లయ్యింది. ఆ ట్రాక్ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

తుఫాన్ బ్యాటింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు గాలించిన బ్యాటర్ కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ, ఈ సంవత్సరం అంటే 2022లో రోహిత్ శర్మ కనీసం ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు.

2013 తర్వాత ఏడాదిలో రోహిత్ ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం ఇదే తొలిసారి. అంటే 9 ఏళ్ల తర్వాత.. ఈ ఏడాదిలోనే తొలిసారి రోహిత్ సెంచరీ నమోదు కాలేదు.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ బొటనవేలికి గాయం కావడంతో నిష్క్రమించాడు. ఆ మ్యాచ్‌లో ఎలాగోలా బ్యాటింగ్ చేసి 27 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టినా జట్టును గెలిపించలేకపోయాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ బొటనవేలికి గాయం కావడంతో నిష్క్రమించాడు. ఆ మ్యాచ్‌లో ఎలాగోలా బ్యాటింగ్ చేసి 27 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టినా జట్టును గెలిపించలేకపోయాడు.