
డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించాడు. కాగా సెంచరీతో రోహిత్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన రెండో యాక్టివ్ టీమిండియా ప్లేయర్‌గా నిలిచాడు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ఈ స్టార్ బ్యాటరో కాదు. టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన యాక్టివ్ ప్లేయర్లలో అతనిదే అగ్రస్థానం.

రవిచంద్రన్ అశ్విన్: వెస్టిండీస్‌పై 12 ఇన్నింగ్స్‌లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ మొత్తం 4 సెంచరీలు చేశాడు. దీంతో ప్రస్తుతం భారత్‌కు ఆడుతున్న ఆటగాళ్లలో వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

రోహిత్ శర్మ: వెస్టిండీస్‌తో జరిగిన 5 టెస్టు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 3 సెంచరీలు సాధించాడు. దీంతో ఈ జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ: వెస్టిండీస్‌తో జరిగిన 20 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ కేవలం 2 సెంచరీలు మాత్రమే చేశాడు.

అజింక్య రహానె: వెస్టిండీస్‌పై మొత్తం 11 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన అజింక్య రహానే 2 సెంచరీలు సాధించాడు.