
India vs West Indies: గత 4 సంవత్సరాలుగా సంజూ శాంసన్ ఏం చేస్తున్నాడు? బ్లూ జెర్సీలో టీ20 ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా విఫలమయ్యాడు. వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జింబాబ్వే ఏ జట్టుపైనా అతని బ్యాట్ పని చేయలేదు. టీ20లో అతడి బ్యాట్ పనిచేయడం లేదు. అతను అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అతని బ్యాట్ మూగబోయింది.

శాంసన్ 2015లో జింబాబ్వేతో జరిగిన టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను 22 మ్యాచ్‌లు ఆడాడు. 22 మ్యాచ్‌లలో 19 ఇన్నింగ్స్‌లలో, అతను ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును దాటగలిగాడు.

శాంసన్ 18 ఇన్నింగ్స్‌ల్లో 18.82 సగటుతో 320 పరుగులు చేశాడు. అతను తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. అలాగే తన ఎంపిక సరైనదని కూడా నిరూపించడం లేదు. అతని పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. అతడిని జట్టు నుంచి తప్పించగానే.. ఛాన్స్‌లు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యేది. తీరా ఛాన్స్ ఇస్తారనే టాక్ వచ్చి, అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

వెస్టిండీస్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం శాంసన్‌కు లభించింది. కానీ, ఒక్క మ్యాచ్‌లో కూడా అతని బ్యాట్ పనిచేయలేదు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో, అతను 3 మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసే అవకాశం పొందాడు. అతని స్కోర్లు మూడు మ్యాచ్‌లలో 12, 7, 13లుగా ఉన్నాయి. ఈ సంవత్సరం అతను ఇప్పటివరకు 6 T20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతని అతిపెద్ద ఇన్నింగ్స్ 13 పరుగులుగా కావడం గమనార్హం. వెస్టిండీస్‌తో జరిగిన 5వ మ్యాచ్‌లో ఈ పరుగులు చేశాడు.

అంతకుముందు 2022లో కూడా అతను టీమ్ ఇండియా తరపున 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐర్లాండ్‌పై 77 పరుగులు చేశాడు. అతని T20 కెరీర్‌లో ఇది తొలి హాఫ్ సెంచరీ. టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన తర్వాత వరుసగా అవకాశాలు వస్తున్నా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

2015లో అరంగేట్రం చేసిన తర్వాత దాదాపు 5 ఏళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను 2020లో తిరిగి వచ్చి ఆ సంవత్సరం 6 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 23 పరుగులు మాత్రమే చేశాడు. 2021లో, శాంసన్ 3 మ్యాచ్‌లు ఆడాడు. కానీ, అతని బ్యాట్ ఒక్కదానిలోనూ భారీ స్కోర్ చేయలేకపోయింది.