Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: పాకిస్థాన్‌కు బ్యాడ్ న్యూస్.. ‘539 రోజుల’ భారత ఆటగాడి దెబ్బకు మరో ఓటమి పక్కా?

ASIA CUP 2022: వరుస విజయాల బాట పట్టేందుకు భారత్‌ బరిలోకి దిగనుండగా.. పాక్‌ ప్రతీకార ధోరణితో బరిలోకి దిగనుంది.

Venkata Chari

|

Updated on: Sep 04, 2022 | 5:51 PM

ASIA CUP 2022: 2022 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మళ్లీ తలపడనున్నాయి. వరుస విజయాల బాట పట్టేందుకు భారత్‌ బరిలోకి దిగనుండగా.. పాక్‌ ప్రతీకార ధోరణితో బరిలోకి దిగనుంది. అయితే, 539 రోజుల భారత బ్యాట్స్‌మెన్‌ దెబ్బకు మరోసారి పాక్ జట్టు ఓడిపోవాల్సిందే.

1 / 5
539 రోజుల బ్యాట్స్‌మెన్ అంటే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ అని అర్థం. అలా ఎందుకు అంటున్నారు అనే కదా మీ ప్రశ్న. T20 ఇంటర్నేషనల్‌లో సూర్యకుమార్ ఎంట్రీ గురించే అన్నమాట.

2 / 5
సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ T20లో అరంగేట్రం చేసి నేటికి 539 రోజులు అయ్యింది. అప్పటి నుంచి అతను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సమయంలో అతను 23 ఇన్నింగ్స్‌లలో 758 పరుగులు చేశాడు.

3 / 5
సూర్యకుమార్ యాదవ్ 14 మార్చి 2021న తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సూర్య తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ 26 ఇన్నింగ్స్‌ల్లో 747 పరుగులు చేశాడు.

4 / 5
విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా వంటి బలమైన ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీ 13 ఇన్నింగ్స్‌ల్లో 474 పరుగులతో ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ T20I అరంగేట్రం నుంచి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌లలో శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఉండగా, హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఉన్నాడు.

5 / 5
Follow us