
WTC ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడి ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. చివరి రోజు ఆటలో 280 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 209 పరుగుల తేడాతో విజయం సాధించింది.

విశేషమేమిటంటే.. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లెవరూ ఈసారి ఐపీఎల్ ఆడలేదు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మాత్రం అద్భుతంగా ఆడారు. అందులో ముఖ్యంగా ట్రావిస్ హెడ్..

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ఈ ఐపీఎల్‌లో కనిపించలేదు. అతను చివరిసారిగా 2017లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరంగా ఉన్నాడు.

ఈసారి ఐపీఎల్ వేలంలో స్టీవ్ స్మిత్ పేరు కూడా లేదు. దీంతో అతను కూడా ఈసారి ఐపీఎల్‌లో కనిపించలేదు. కానీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ 121 పరుగులు చేశాడు.

ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న అలెక్స్ కారీ ఈ ఐపీఎల్‌లో ఆడలేదు. కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు, 2వ ఇన్నింగ్స్‌లో అజేయంగా 66 పరుగులు చేశాడు క్యారీ.

ఇక బౌలింగ్ విభాగంలో ఈసారి ఐపీఎల్ ఆడని నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్ చెరో 5 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.