శివలీల గోపి తుల్వా |
Jun 20, 2023 | 9:47 PM
WET Asia Cup 2023: హాంకాంగ్‌లోని మోంగ్‌కాక్‌లో జరుగుతున్న ACC ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్ A ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే.. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన భారత జట్టు టైటిల్ మ్యాచ్‌కు చేరుకుంది.
టోర్నమెంట్ వర్షం కారణంగా గందరగోళంగా మారింది. ఆతిథ్య. హాంకాంగ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. భారత జట్టు. ఇక ఆ తర్వాత నేపాల్, పాకిస్థాన్‌లతో జరగాల్సిన లీగ్ మ్యాచ్‌లు వర్షంలో కొట్టుకుపోయాయి.
ఆ క్రమంలోనే సోమవారం శ్రీలంకతో టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్‌కు వర్షం అడ్డురావడంతో రిజర్వ్ డే వరకు కొనసాగింది. మంగళవారం కూడా వర్షం ఈ మ్యాచ్‌కు అవరోధంగా నిలవడంతో మెరుగైన నెట్ రన్‌రేట్ కలిగిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది.
అయితే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు వర్షంలో కొట్టుకోపోయాయి. ఇదే తరహాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్‌కి కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
అదే జరిగితే గ్రూప్ దశలో బంగ్లాదేశ్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది కనుక పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అలాగే జూన్ 21న ఫైనల్‌లో టీమిండియాతో తలపడుతుంది. ఒకవేళ రెండో సెమీస్ జరిగితే గెలిచిన మ్యాచ్ భారత్‌తో టైటిల్ కోసం బరిలోకి దిగుతుంది. కానీ ఫైనల్ మ్యాచ్‌పై కూడా వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉంది.