
టెస్టు.. వన్ డే.. టీ20.. ఐసీసీ ఇలా మూడు ఫార్మాట్ల క్రికెట్ టీమ్ ర్యాంకింగ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే 2వ జట్టుగా నిలిచింది.

ఇంతకు ముందు టెస్టు, టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా వన్డే జట్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. కానీ, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వన్డే జట్ల ర్యాంకింగ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

దీంతో పాటు మూడు ఫార్మాట్లలో 1వ ర్యాంక్‌లో ఉన్న టీమ్ ఇండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు దక్షిణాఫ్రికా కూడా ఇలాంటి రికార్డును నమోదు చేసింది.

2012లో గ్రేమ్ స్మిత్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు టెస్ట్, T20, ODI క్రికెట్‌లో అగ్రస్థానాన్ని పొందిన ప్రపంచంలోనే మొదటి జట్టుగా నిలిచింది.

ఇప్పుడు మూడు ఫార్మాట్లలో నంబర్ 1 జట్టుగా అవతరించి టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించడం విశేషం.