India Vs West Indies: వెస్టిండీస్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి టీ20 సిరీస్‌ను కోల్పోయింది. భారత్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్లు సులువుగా ఛేదించారు. కానీ, టీమ్ ఇండియా తరుపున బ్యాటింగ్ చేస్తూ ఒంటరిగా అర్ధ సెంచరీతో పోరాడిన సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.
ఆగస్టు 13న వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో 45 బంతుల్లో 61 పరుగులతో టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. సహచరుడు కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇప్పటివరకు, సూర్య T20 ఫార్మాట్‌లో 53 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 50 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 1841 పరుగులు చేశాడు. దీంతో 50 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
అంతకుముందు, గాయం కారణంగా వెస్టిండీస్ పర్యటన నుంచి వైదొలిగిన కేఎల్ రాహుల్ తన మొదటి 50 T20 ఇన్నింగ్స్‌లో 1751 పరుగులు చేసి జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. ఇప్పుడు ఈ రికార్డును సూర్యకుమార్ బ్రేక్ చేశాడు.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన తొలి 50 టీ20 ఇన్నింగ్స్‌లో 1943 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 1841 పరుగులతో 2వ స్థానంలో, కేఎల్ రాహుల్ 1751 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
అలాగే టీమ్ ఇండియాకు చాలా కాలంగా దూరంగా ఉన్న మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 1311 పరుగులతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.
తొలి 50 టీ20 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 1219 పరుగులు చేసి ఐదో స్థానంలో ఉన్నాడు.