
IND vs WI Records: భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే, టీ20 సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి మొదలుకానుంది. ఈమేరకు ఇరు జట్ల మమధ్య నెలకొన్న కొన్ని రికార్డులను ఇప్పుడు పరిశీలిద్దాం. అయితే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.

Virat Kohli

ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌పై 39 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు సాధించాడు. విండీస్‌పై లిటిల్ మాస్టర్ అత్యధిక స్కోరు 141 పరుగులుగా నిలిచింది.

భారత్‌పై 41 వన్డేల్లో క్రిస్ గేల్ 4 సెంచరీలు సాధించాడు. ఇందులో క్రిస్‌గేల్ అత్యధిక స్కోరు 140 పరుగులుగా నిలిచింది.

ఈ జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌పై 33 వన్డేల్లో 3 సెంచరీలు సాధించిన రోహిత్.. 162 పరుగలతో అత్యధిక స్కోరు నమోదుచేశాడు.

ప్రస్తుతం టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా వెస్టిండీస్‌పై 3 సెంచరీలు సాధించాడు. విండీస్‌తో మొత్తం 40 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

వెస్టిండీస్‌పై యువరాజ్ సింగ్ కూడా 3 సెంచరీలు సాధించాడు. వెస్టిండీస్‌తో యూవీ 31 మ్యాచ్‌లు ఆడాడు.

ఈ జాబితాలో వెస్టిండీస్‌కు చెందిన శామ్యూల్స్ 7వ స్థానంలో నిలిచాడు. భారత్‌పై 44 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు సాధించాడు.

వెస్టిండీస్‌కు చెందిన గోర్డాన్ గ్రీనిడ్జ్ కూడా భారత్‌పై 3 సెంచరీలు నమోదు చేశాడు. భారత్‌తో మొత్తం 24 మ్యాచ్‌లు ఆడాడు.