IND vs SL Asia Cup 2023 Final: సచిన్ ఆల్ టైమ్ రికార్డుపై రోహిత్ శర్మ కన్ను..! లంకపై కొన్ని పరుగులు చేసినా చరిత్ర సృష్టించినట్లే..

|

Sep 17, 2023 | 12:32 PM

IND vs SL, Asia Cup 2023 Final: ఆసియా కప్ గ్రూప్, సూపర్ 4 రౌండ్‌లో ప్రత్యర్థులను మట్టి కరిపించిన భారత్, శ్రీలంక జట్లు నేడు టైటిల్ కోసం ఫైనల్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. టోర్నీ టైటిల్ కోసం ఇరు జట్ల మధ్య 9వ సారి జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే రోహిత్ మాత్రం నేటి మ్యాచ్‌లో ఎలా అయినా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాలని, సచిన్ పేరిట ఉన్న ఏళ్ల నాటి రికార్డ్‌ను బ్రేక్ చేయాలనే యోచనలో ఉన్నాడు. ఇంతకీ రోహిత్ కన్ను పడిన ఆ రికార్డ్ ఏమిటి..? అతనికి సమీపంలో ఎవరైనా ఉన్నారా..? 

1 / 5
IND vs SL, Asia Cup 2023 Final: భారత్, శ్రీలంక మధ్య ఈ రోజు జరిగే ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విజృంభిస్తే.. సచిన్ పేరిట ఉన్న ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్ అవుతుంది. ఇందుకోసం రోహిత్ మరో 33 పరుగులు చేస్తే చాలు. 

2 / 5
అవును, ఆసియా కప్(వన్డే ) టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున 23 వన్డే మ్యాచ్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ 2 సెంచరీలు, 7 అర్థ సెంచరీలతో మొత్తం 971 పరుగులు చేశాడు.

3 / 5
అయితే ఆసియా కప్‌లో భారత్ తరఫున ఇప్పటివరకు 939 పరుగులు చేసిన రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇందుకోసం 27 వన్డేలు ఆడిన రోహిత్.. టోర్నీలో ఓ సెంచరీ, 9 అర్థ సెంచరీలు కూడా చేశాడు. 

4 / 5
అంటే సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసేందుకు రోహిత్ శర్మ నేడు జరిగే ఫైనల్‌లో మరో 33 పరుగలు చేస్తే చాలు. ఫలితంగా ఆసియా కప్(వన్డే ) టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించడంతో పాటు సచిన్‌ని అధిగమిస్తాడు.

5 / 5
విశేషం ఏమిటంటే.. ఆసియా కప్ (వన్డే) టోర్నీలో సచిన్ 971, రోహిత్ 939 పరుగులు చేసి తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరికీ సమీపంలో ఎవరూ లేరు. 15 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో 742 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ వీరిద్దరికీ చాలా దూరంలో ఉన్నట్లే. నేటి మ్యాచ్‌లో కోహ్లీ కనీసం 229 పరుగులు చేస్తేనే సచిన్‌ని అధిగమించగలడు.