IND vs SA: కేప్‌‌టౌన్‌‌లో ఉద్వేగానికి లోనైన భారత స్టార్ బౌలర్.. ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ట్వీట్..!

|

Jan 10, 2022 | 7:27 AM

Jasprit Bumrah: భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కేప్ టౌన్‌తో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. టెస్ట్ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌కి ముందు, భారత పేసర్ అదే గుర్తు చేసుకున్నాడు.

1 / 4
కేప్ టౌన్ చేరుకున్న భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ టెస్ట్ మ్యాచ్ భారత జట్టుకు చాలా ప్రత్యేకమైనదని నిరూపించవచ్చు. ఇందులో టీమిండియా సూపర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాలా కీలకం కానున్నాడు. ఎందుకంటే ఈ న్యూలాండ్స్ మైదానం బుమ్రాకు చాలా ప్రత్యేకమైనది. బుమ్రా టెస్టు కెరీర్ నాలుగేళ్ల క్రితం ఇదే మైదానంలో ప్రారంభమైంది. మరోసారి బుమ్రా ఇక్కడ సత్తా చాటేందుకు వచ్చాడు.

2 / 4
జనవరి 11న ప్రారంభమయ్యే కేప్ టౌన్ టెస్టుకు ముందు, బుమ్రా నాలుగేళ్ల క్రితం కేప్ టౌన్‌లో తన ప్రయాణం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. భావోద్వేగ సందేశాన్ని కూడా ఈ సందర్భంగా పంచుకున్నాడు. బుమ్రా ట్వీట్‌లో ఏముందంటే.. "కేప్ టౌన్, జనవరి 2018- ఇక్కడే నాకు టెస్ట్ క్రికెట్ ప్రారంభమైంది. నాలుగు సంవత్సరాల తరువాత మరోసారి ఇక్కడ అడుగుపెట్టాను. ఇన్నేళ్లలో నేను ఒక ఆటగాడిగా, ఒక వ్యక్తిగా మారాను. ఈ మైదానానికి తిరిగి రావడం ప్రత్యేక జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది" అంటూ ట్వీట్ చేశాడు.

3 / 4
2016లో టీ20, వన్డేల నుంచి టీమ్ ఇండియాలో చోటు సంపాదించిన ఫాస్ట్ బౌలర్ బుమ్రా 2018 జనవరి 5న కేప్ టౌన్‌లోనే టెస్టు అరంగేట్రం చేశాడు. బుమ్రా తొలి వికెట్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 వికెట్లు తీశాడు.

4 / 4
ఇక్కడి నుంచి అతను టీమ్ ఇండియా అగ్రగామి ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. ఇప్పటివరకు కేవలం 26 టెస్టుల్లో 107 వికెట్లు పడగొట్టాడు. 4 ఏళ్ల క్రితం కేప్‌టౌన్‌లో సిరీస్‌లో తొలి మ్యాచ్ జరిగింది. ఈసారి సిరీస్‌లో చివరి మ్యాచ్‌ జరగనుంది. అప్పుడు బుమ్రా భారత్‌ను గెలిపించడంలో విఫలమయ్యాడు. కానీ, 4 సంవత్సరాల తర్వాత అతను న్యూలాండ్స్ పిచ్‌పై విధ్వంసం సృష్టించి భారతదేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు.