దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, టీ20ల సిరీస్ తర్వాత భారత క్రికెట్ జట్టు ఇప్పుడు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. సెంచూరియన్‌లో బాక్సింగ్ డే టెస్టు డిసెంబర్ 26న ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ, టెంబా బావుమా తమ జట్లకు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు.
సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లోని పిచ్ వేగంగా, బౌన్సీగా ఉంటుంది. ఇది దక్షిణాఫ్రికాలో అత్యంత వేగవంతమైన పిచ్‌గా గుర్తింపు పొందింది. పిచ్ బౌలర్లకు (ముఖ్యంగా పేసర్లకు) అనుకూలంగా ఉంటుంది. అయితే, బ్యాట్స్‌మెన్స్ మాత్రం ఇబ్బంది పడాల్సిందేనని తెలుస్తోంది.
సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో స్పిన్నర్లు ఎప్పుడూ రాణించలేదు. ఇండో-ఆఫ్రికా జట్టును పరిశీలిస్తే.. కేశవ్ మహరాజ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్నర్లు ఉన్నారు. మరి వారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 330. ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి మొదటి ఇన్నింగ్స్ సహాయపడుతుంది. నాలుగో ఇన్నింగ్స్‌లో ఛేజింగ్ చాలా కష్టం. ఇక్కడ ఆడిన 28 మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా 250 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేదు.
2023లో సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ నిర్వహించారు. ఓవరాల్ రికార్డు ప్రకారం, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 342 పరుగులు చేసింది. ఛేజింగ్ జట్టు 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే, ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాల్సి ఉంటుంది.