న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి తొలి ఇన్నింగ్స్‌ను 402 పరుగులకు ముగించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల ఆధిక్యాన్ని కొనసాగించింది. జట్టు తరపున రచిన్ రవీంద్ర సెంచరీ ఇన్నింగ్స్ ఆడగా, కాన్వే, సౌథీ అర్ధ సెంచరీలతో రాణించారు.