Glenn Maxwell: భారత బౌలర్లను దంచికొట్టిన మాక్స్‌వెల్.. రోహిత్ శర్మ భారీ రికార్డ్‌లో ఆసీస్ డేంజరస్ ప్లేయర్..

|

Nov 29, 2023 | 12:59 PM

IND vs AUS, Glenn Maxwell: భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సమం చేశాడు. మ్యాక్స్ వెల్ 48 బంతుల్లో మొత్తం 8 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 104 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

1 / 7
భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.

2 / 7
మ్యాక్స్ వెల్ 48 బంతుల్లో మొత్తం 8 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 104 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

3 / 7
ఈ ఫార్మాట్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌కి ఇది నాలుగో సెంచరీ. పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.

4 / 7
తన 47 బంతుల్లో సెంచరీతో, మ్యాక్స్‌వెల్ పురుషుల T20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరపున వేగవంతమైన సెంచరీలు చేసిన ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్ రికార్డును సమం చేశాడు.

5 / 7
ఆసక్తికరంగా, ఇది ఆస్ట్రేలియాకు మాక్స్‌వెల్ 100వ T20 అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. రోహిత్ T20 రికార్డును సమం చేయడం ద్వారా మాక్స్‌వెల్ అతని సెంచరీని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.

6 / 7
రోహిత్ శర్మ, గ్లెన్ మాక్స్‌వెల్ చెరో 4 సెంచరీలతో టాప్‌లో ఉండగా, బాబర్ ఆజం, సూర్యకుమార్ యాదవ్ 3 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు.

7 / 7
మ్యాక్స్‌వెల్ మ్యాచ్ చివరి నాలుగు బంతుల్లో భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఒక సిక్స్, వరుసగా మూడు ఫోర్లు కొట్టి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ని సజీవంగా ఉంచుకుంది.