Venkata Chari |
May 31, 2023 | 7:34 AM
IPL 2023: ఈ IPL ప్లేఆఫ్స్ మ్యాచ్‌కు ముందు BCCI కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా, ప్లేఆఫ్స్ మ్యాచ్‌లలో వేసిన ప్రతి డాట్ బాల్‌కు, టాటా కంపెనీ భాగస్వామ్యంతో 500 మొక్కలు నాటనున్నట్లు BCCI ప్రకటించింది.
ఈ కారణంగా, ప్లేఆఫ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ ఇమేజ్ గ్రాఫిక్ ఉపయోగించారు. ఇప్పుడు ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. ప్లేఆఫ్స్ దశలో ఆడిన మొత్తం 4 గేమ్‌ల్లో ఎన్ని డాట్ బాల్స్ ఆడారో అనే ఉత్సుకత పెరిగింది.
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు 40 ఓవర్లలో మొత్తం 84 డాట్ బాల్స్ వేశారు.
లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు వేసిన మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 96గా నమోదైంది.
ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 67 డాట్ బాల్స్ మాత్రమే వచ్చాయి.
అలాగే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వేసిన మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 45గా నమోదైంది. అంటే 4 మ్యాచ్‌ల నుంచి మొత్తం 292 డాట్ బాల్స్ కొట్టారు.
అంటే 292 x 500 లెక్కల ప్రకారం టాటా సహకారంతో బీసీసీఐ మొత్తం 1 లక్షా 46 వేల మొక్కలు నాటనుంది. దీని ద్వారా గ్రీన్ డాట్ ప్రచారంలో ఐపీఎల్ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టడం విశేషం.