
ఆదివారం న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా జట్టు 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుకు ఇది వరుసగా మూడో విజయం. హ్యాట్రిక్ విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.

ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో మూడు విజయాలతో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. వెస్టిండీస్‌ను ఓడించి అగ్రస్థానానికి చేరుకున్న భారత్‌ను తొలి స్థానం నుంచి తప్పించింది. మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచింది.

రెండు మ్యాచ్‌లు ఆడి రెండింట్లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఆతిథ్య న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ తక్కువ నెట్ రన్ రేట్ కారణంగా నాలుగో స్థానంలో ఉంది.

వెస్టిండీస్ జట్టు ఐదో స్థానంలో ఉంది. ఆ టీం మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో రెండు గెలిచింది. అయితే భారత్‌పై తన మొదటి ఓటమిని అందుకుంది. నాలుగు పాయింట్లను కలిగి ఉన్నా.. తక్కువ నెట్-రేట్ కారణంగా ఐదో స్థానంలో ఉంది.

ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు చెరో 2 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో ఒక్కటి కూడా గెలవలేదు. అయితే మెరుగైన నెట్‌నెరేట్ కారణంగా ఇంగ్లండ్ ఆరో స్థానంలోనూ, బంగ్లాదేశ్ ఏడో స్థానంలో నిలిచాయి. అదే సమయంలో హ్యాట్రిక్ ఓటమిని చవిచూసిన పాక్ జట్టు చివరి స్థానంలో నిలిచింది.