ICC ODI Ranking: విరాట్ కోహ్లీకి షాకిచ్చిన పాకిస్తాన్ సారథి.. భారీ తేడాతో అగ్రస్థానంలోకి..

|

Apr 06, 2022 | 5:19 PM

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 2 సెంచరీలు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.

1 / 4
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎలాంటి బౌలర్‌కైనా చెమటలు పట్టిస్తున్నాడు. ఈక్రమంలో బాబర్ నిరంతరం రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ ఈ ప్రదర్శనకు ప్రతిఫలం అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో బాబర్ నంబర్ వన్ స్థానంలో తన పట్టును మరింత పటిష్టం చేసుకున్నాడు.

2 / 4
మార్చి 6, బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో బాబర్ అజామ్ వన్డేల్లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాపై 2 సెంచరీలు చేసిన తర్వాత, బాబర్ రెండవ ర్యాంక్‌లో ఉన్న భారత స్టార్ విరాట్ కోహ్లీపై భారీ ఆధిక్యాన్ని సంపాదించాడు. తాజా ర్యాంకింగ్‌లో బాబర్‌కు 891 రేటింగ్ పాయింట్లు ఉండగా, విరాట్ కోహ్లీకి 811 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.

3 / 4
బాబర్ మాత్రమే కాదు, పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సహాయంతో దాదాపు 300 పరుగులు చేశాడు. దీంతో అతను 7 స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు.

4 / 4
బౌలర్ల విషయానికొస్తే.. అందులో పెద్దగా మార్పు లేదు. న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు క్రిస్‌ వోక్స్‌ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది 8 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్‌లో భారత్‌ నుంచి జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఆరో స్థానంలో ఉన్నాడు.