ఛాంపియన్స్‌ ట్రోఫీ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌ 5 బౌలర్లు వీరే!

Updated on: Feb 16, 2025 | 5:42 PM

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌, దుబాయ్‌ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. 23న పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో చాలా మంది బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. వారిలో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌ 5 బౌలర్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 / 5
న్యూజిలాండ్‌ ఆటగాడు కైల్ మిల్స్ 28 వికెట్లతో నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉన్నాడు. 2002 నుంచి 2013 మధ్య జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో 15 మ్యాచ్‌లు ఆడిన మిల్స్‌ 17.25 యావరేజ్‌తో 28 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు 4 వికెట్ల హాల్‌ సాధించాడు. ఎకానమీ 4.29గా ఉంది.

2 / 5
ఇక రెండు స్థానంలో శ్రీలంక దిగ్గజ మాజీ బౌలర్‌ లసిత్‌ మలింగా ఉన్నాడు. తన వేగంతో, ప్రత్యేకమైన బౌలింగ్‌ శైలితో గుర్తింపు తెచ్చుకున్న మలింగా 2006 నుంచి 2017 మధ్య ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో 16 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 30.64 యావరేజ్‌తో 25 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు 4 వికెట్ల హాల్‌ సాధించాడు. ఎకానమీ వచ్చేసి 5.31గా ఉంది.

3 / 5
మూడో స్థానంలో కూడా మరో శ్రీలంకన్‌ ఆటగాడే ఉన్నాడు. అతను మరెవరో కాదు దిగ్గజ బౌలర్‌ ముత్తయ్య మురళీదరణ్‌. ఈ లెజెండ్‌ 1998 నుంచి 2009 మధ్య జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో 17 మ్యాచ్‌లు ఆడి 20.16 యావరేజ్‌తో 24 వికెట్లు సాధించాడు. రెండు స్లారు నాలుగు వికెట్ల హాల్‌ సాధించాడు. ఎకానమీ 3.60గా ఉంది.

4 / 5
ఇక నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ బ్రెట్‌ లీ నిలిచాడు. లీ 2000 నుంచి 2009 మధ్య కాలంలో 16 ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. 26.86 యావరేజ్‌తో 22 వికెట్లు సాధించాడు. బెస్ట్‌ స్టాట్స్‌ వచ్చేసి ఓ మ్యాచ్‌లో 38 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ఎకానమీ 4.79గా ఉంది.

5 / 5
ఐదో స్థానంలోనూ మరో ఆస్ట్రేలియన్‌ ఆటగాడే ఉన్నాడు. అతనే ది గ్రేట్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌. ఫర్ఫెక్ట్‌ లైన్‌ అండ్‌ లెంత్‌ బౌలింగ్‌కు పెట్టింది పేరైన మెక్‌గ్రాత్‌ 2000 నుంచి 2006 మధ్య జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో 12 మ్యాచ్‌లు ఆడి 19.61 యావరేజ్‌తో 21 వికెట్లు సాధించాడు. ఒక మ్యాచ్‌లో 5 వికెట్ల హాల్‌ సాధించాడు. ఎకానమీ వచ్చేసి 4.03గా ఉంది.