భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 20 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. కోహ్లీ రికార్డ్‌ను సమం చేశాడు.
మూడో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టి భారత్‌ని గెలిపించాడు. విరాట్ కోహ్లీ గతంలో ఇలా 4 సార్లు సిక్సర్ కొట్టి మ్యాచ్‌లో భారత్‌ని గెలిపించాడు.
తాజాగా జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ కొట్టిన హార్దిక్ కూడా విన్నింగ్ సిక్సర్ బాది నాల్గో సారి మ్యాచ్‌ని గెలిపించాడు. దీంతో కోహ్లీ విన్నింగ్ సిక్సర్ల రికార్డ్‌ని పాండ్యా సమం చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ విండీస్ బౌలర్లపై చెలరేగాడు. 44 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు.
అలాగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్‌లో 4వ నెంబర్‌లో 49 పరుగుల వద్ద అజేయంగా నిలిచిన రెండో ఆటగాడిగా కూడా తిలక్ వర్మ నిలిచాడు. 2016లో సురేష్ రైనా కూడా 49 పరుగులతో నిలిచాడు.