2 / 6
ఆస్ట్రేలియాపై 174 బంతుల్లో 187 పరుగులు (2013, మొహాలీ): 2013లో ఆసీస్ జట్టు భారత పర్యటన సందర్భంగా జరిగిన రెడ్-బాల్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ధావన్ తన టెస్ట్ కెరీర్‌ను ధాటిగా ప్రారంభించాడు. మురళీ విజయ్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన ధావన్.. తన మొదటి టెస్ట్‌లో 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 174 బంతుల్లో 33 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 187 పరుగులు సాధించాడు. రెండవ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేయలేదు. కానీ, గబ్బర్ అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మొహాలీ టెస్టులో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.