
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టారు. వారిలో మొదటి వ్యక్తి టీమిండియా సిక్సర్ కింగ్ ఫేమ్ యువరాజ్ సింగ్. ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా డారియస్ విస్సర్ ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రవేశించాడు. ఇంతకీ టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

1- యువరాజ్ సింగ్: టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా టీమిండియా మాజీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ నిలిచాడు. 2007 T20 ప్రపంచ కప్‌లో, ఇంగ్లండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌ల రికార్డును లిఖించాడు.

2- కీరన్ పొలార్డ్: యువరాజ్ సింగ్ తర్వాత, టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ నిలిచాడు. 2021లో పొలార్డ్ శ్రీలంక ఆటగాడు అకిలా ధనంజయ ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు.

3- దీపేంద్ర సింగ్ ఎయిరి: ACC ప్రీమియర్ కప్ మ్యాచ్‌లో నేపాలీ బ్యాట్స్‌మెన్ దీపేంద్ర సింగ్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాడు. ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో కమ్రాన్ ఖాన్ ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు.

4- డారియస్ విస్సర్: T20 ప్రపంచ కప్ తూర్పు ఆసియా-పసిఫిక్ జోన్ క్వాలిఫయర్‌లో సమోవా బ్యాట్స్‌మెన్ డారియస్ విస్సర్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు. వనాటు పేసర్ నలిన్ నిపికో బౌలింగ్ లో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టి డారియస్ విస్సర్ సరికొత్త రికార్డు సృష్టించాడు.