
సచిన్ టెండూల్కర్- 2278 పరుగులు: ప్రపంచ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో 2278 పరుగులతో అత్యధిక పరుగులు చేశాడు. 44 ఇన్నింగ్స్‌లలో 56.95 సగటుతో పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

రికీ పాంటింగ్- 1743 పరుగులు: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ పాంటింగ్ 1743 పరుగులు చేశాడు. అతను 42 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు, 6 అర్ధసెంచరీలతో సహా 45.86 సగటుతో 1743 పరుగులు చేశాడు.

కుమార్ సంగక్కర-1532 పరుగులు: శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర 35 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో సహా 56.74 సగటుతో 1532 పరుగులు చేశాడు.

బ్రియాన్ లారా- 1225 పరుగులు: వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ లారా 33 ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లలో 42.24 సగటుతో 2 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో 1225 పరుగులు చేశాడు.

ఏబీ డివిలియర్స్- 1207 పరుగులు: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో 63.52 సగటుతో 22 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, 6 అర్ధసెంచరీలతో 1207 పరుగులు చేశాడు.